పేదల సొంతింటి కల నెరవేర్చిన మహానుభావుడు కేసీఆర్
* రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
పేదల సొంతింటి కల నేర్చిన మహానుభావుడు కేసీఆర్ అని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహలక్ష్మీ పథకం ద్వారా మంజూరు ఉత్తర్వుల పత్రాలను గురువారం భక్తరామదాసు కళాక్షేత్రంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లబ్దిదారులకు స్వయంగా పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చిన మహానుభావుడు ఆత్మబంధువు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ఇళ్లు లేని వారు ఉండకూడదు అనేదే కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహలక్ష్మి వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి మానస పుత్రిక గృహ లక్ష్మి పథకమని పేర్కొన్నారు.
గృహలక్ష్మి పథకం నిరంతరం ప్రక్రియ అని, తెలంగాణలో సంపద పెంచి పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమన్నారు. అభివృద్ధి సంక్షేమంలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉందని బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు.
పార్టీల కతీతమైన ప్రజాసంక్షేమమే బీఆర్ఎస్ ప్రధాన ఎజెండా అని అన్నారు. గత పాలకుల హయాంలో గ్రామాలకు లక్ష రూపాయల నిధులు తేవాలంటే సాధ్యం కాని దారుణమైన పరిస్తితులు ఉంటే నేడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పెన్షన్లు రైతుబంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి బిసి బంధు ఆసరా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని నిత్యం పేదల సంక్షేమం కోసం ఆలోచించేది ఒక్క కెసిఆర్ రే అని మళ్ళీ
బిఆర్ఎస్ ప్రభుత్వంను కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.