మన్యం న్యూస్,మణుగూరు:
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని మణుగూరు మండల నూతన సిఐగా బాధ్యతలు చేపట్టిన రమకాంత్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేయడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణకు శాయశక్తులా కృషి చేస్తానని, ఫ్రెండ్లీ పోలీస్ పాటిస్తామనిఈ సందర్భంగా సిఐ అన్నారు.