భద్రగిరికి కొత్త శోభ!
* రాముని సామ్రాజ్యం అభివృద్ధికి ప్రభుత్వం ఫోకస్
* ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షుడు రేగా కృషి
* సదుపాయాలకు కోట్ల రూపాయల మంజూరు
* గోదావరి కరకట్ట విస్తరణకు రూ.38.04 కోట్లు
* పట్టణంలో సిసి రోడ్లకు సెంట్రల్ లైటింగ్ కు సుమారు రూ.14.50 కోట్లకు పైగా నిధులు
* యాదాద్రి తరహాలో భద్రాచలం టెంపుల్
* మారనున్న రూపురేఖల వల్ల జనం హర్షాతిరేకాలు
* నేడు మంత్రి కేటీఆర్ రాక.. అభివృద్ధి పనులకు శ్రీకారం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
వస్తున్నాడు అదిగో.. వస్తున్నాడు అదిగో.. చొరవగా వస్తున్నాడు అదిగో.. మన జననేత రామన్న అంటూ ఆయన అభిమానులు సంబరంలో మునిగితేలారు. ఐటి పురపాలక శాఖ మంత్రి తారక రామారావు భద్రాద్రి రామరాజ్యంలో శనివారం అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు నిత్యం జనసంచారం ఉండే ప్రదేశంలో భారీ ఫ్లెక్సీలు తోరణాలు కట్టి సిద్ధమయ్యారు. ఈ ఫ్లెక్సీల తోరణాల హడావిడిని చూసిన ప్రజలు ఇక భద్రాచలం పట్టణ రూపురేఖలు మారబోతున్నాయని సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం. గోదావరి కరకట్ట విస్తరణకు, పట్టణంలోని పలు ప్రాంతాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీలు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులకుమంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో భద్రగిరికి ఇక కొత్త శోభ సంతరించుకోనున్నది. గతంలో భద్రాచలం బస్ స్టేషన్ డిపో ఆధునికరణ జరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రైతు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కూడా అభివృద్ధిలో ముందుంది. ఇప్పుడు తాజాగా గోదావరి కరకట్ట విస్తరణ జరిగేందుకు కావలసిన నిధులు మంజూరు కావడంతో కరకట్ట అందం మరింత పెరగనున్నది. అదేవిధంగా కరకట్ట పక్కనున్న పార్కు అందులో ఉండే ఆహ్లాదకర అందాలు రెట్టింపు ఆకర్షణగా కనబడనున్నాయి. ఈ కట్ట నిర్మాణం వల్ల లోతట్టు ప్రాంత ప్రజలకు ఇక ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రతి వర్షాకాలంలో ఇబ్బంది పడే ప్రజలు ఈ కరకట్ట విస్తరణ వల్ల ప్రజలు ప్రశాంతంగా ఉండవచ్చునని పలువురు పేర్కొంటున్నారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో భద్రాచలం పట్టణం విద్యుత్ కాంతులతో జిగేల్ జిగేల్ గా కనబడనున్నది. ఏది ఏమైనప్పటికీ భద్రాచలంకు అభివృద్ధి మహర్దశ పట్టడంతో పలువురు వ్యాపారస్తులు విద్యావంతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ విప్ రేగా కృషి… నిధులు రాక…
ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు కృషి వల్ల భద్రాచలం పట్టణ అభివృద్ధికి భారీగా నిధులు విడుదల కావడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా కరకట్ట సమస్య పరిష్కారం తీరనుండడంతో భద్రగిరి లోతట్టు ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి తరహాలో భద్రాద్రి దేవాలయాన్ని మార్చడానికి ప్రభుత్వ కృషి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చిత్తశుద్ధి మరువలేనిదని పలువురు పేర్కొంటున్నారు. సెంట్రల్ లైటింగ్ పూర్తి అయితే భద్రగిరి పట్టణం విద్యుత్ కాంతులతో జిగేల్ జిగేల్ గా కనబడబోతుందని పలువురు ఖుషి ఖుషీగా పేర్కొనడం గమనార్హం.