UPDATES  

 మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మెచ్చా

మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే మెచ్చా
పలు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన లు,కళ్యాణ లక్ష్మి చెక్కులు,స్పోర్ట్స్ కిట్లు,బతుకమ్మ చీరలు పంపిణీ.
పూల వర్షం కురిపించిన మహిళలు
ముఖ్యమంత్రి గా మరొక్క సారి కేసీఆర్ నీ ఆశీర్వదించాలి.
మన్యం న్యూస్.ములకలపల్లి. అక్టోంబర్ 05.అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండలంలో పలు చోట్ల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.రాచన్నగూడెంలో సిసి రోడ్డు, జిన్నెలగూడెం – రాచన్నపేట రోడ్డు,ముత్యాలంపాడు లో సీసీ రోడ్డు,హై లెవల్ బ్రిడ్జి, జగన్నాథపురం – రేగులకుంట రోడ్డు నిర్మాణం , చౌటిగుడెం – రింగిరెడ్డిపల్లి , రింగిరెడ్డిపల్లి హై లెవల్ బ్రిడ్జి, మంగపేట – రామాంజనేయపురం, పూసుగూడెంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు, కొమ్ముగూడెం – అల్లిగుంపు,కుమ్మరిపాడులో హై లెవల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన లు చేశారు.ములకలపల్లి రైతు వేదిక వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పండుగ సందర్భంగా కానుకగా బతుకమ్మ చీరలు,కళ్యాణ లక్ష్మి,షాది ముభా రక్ చెక్కులు, స్పోర్ట్స్ కిట్లు పంపిణీ.శంఖుస్థాపన ప్రారంభోత్సవాలకు వెళ్ళిన ఎమ్మెల్యే గ్రామాల్లో ఘనంగా మహిళలు పూలతొ వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.ఎండ్ల నాటి కలని నెరవేర్చడం పై ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ఇప్పుడు ఇప్పుడే అన్ని వస్తున్నాయన్నారు.రానున్న రోజుల్లో తామంతా ఎమ్మెల్యే వెంటే ఉంటామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మొరంపూడి అప్పారావు,దమ్మపేట , జెడ్పీటీసీపైడి వెంకటేశ్వర్లు, స్థానిక ఎంపీటీసీ లు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !