మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం లోని ప్రతి గ్రామం లో ఇంటి ఇంటికి విష జ్వరాలు, డెంగీ, మలేరియా, టైపాయిడ్ జ్వరాల తో ప్రభుత్వ దావఖానాల ముందు బార్లు తీరుతున్నారు. ప్రజలు ప్రభుత్వ దావఖానాలపై వైద్య సిబ్బంది పై మండి పడుతున్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే కూడా ప్రభుత్వం, అదుకారులు పట్టించుకోరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.rప్రభుత్వ దావఖానాల్లో సరి అయిన వైద్యం అందక ప్రయివేట్ దావఖానాలకు పోతే లక్షల్లో వసూలు చేస్తున్నారు మంగపేట మండలం వ్యాప్తంగా ఎంతో మంది విష జ్వరాలు, డెంగి తో మరణించిన కూడా ప్రభుత్వ వైద్య అధికారులు పట్టించుకోవడం లేదు, ప్రభుత్వ దావఖానాల్లో మందులు లేవు, వైద్యం చేసే డాక్టర్స్, నర్స్ లు స్థానికంగా నివాసం ఉండరు, వైద్యం అంటే 24 గంటలు అందుబాటులో ఉండాలి, మండలం లోని కొన్ని దవాఖానాలు మధ్యాహ్నం మూత పడుతున్నాయి, అదేమిటి అని అడుగుతే మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులం ప్రభుత్వ ఉద్యోగులతో సమానం గా మేము పని చేయాలా అని ప్రజలకు ఎదురు సమాధానం ఇస్తున్నారు, మండలం లోని ఇతర ఆరోగ్యం కేంద్రం లో సరి అయిన వైద్య పరీక్షలు లేవు ఉన్న పరీక్షలు మధ్యాహ్నం తర్వాత చేయరు, కెమికల్ అయిపొయింది అని, మిషన్ చెడిపోయింది నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారు అని ప్రజలు వైద్య సిబ్బంది పై మండి పడుతున్నారు. వైద్యలు ప్రజలకు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ప్రాణాలను కాపాడాలని మండలం ప్రజలు కోరారు.గ్రామాల్లో క్రమం తప్పకుండ బ్లీచింగ్, పాగింగ్ చేయాలి, మురికి గుంటల్లో ఆయిల్ బాల్స్ వేయాలి గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించడం గ్రామ పంచాయతీ అధికారుల బాధ్యత, కొన్ని గ్రామ పంచాయతీ లకు ఇంతవరకు గ్రామ పంచాయతీ అధికారులు లేరు, బదిలీ పై వెళ్లిన సెక్రటరీ స్థానం లో ఇంతవరకు అధికారులు విధుల్లోకి రాకపోవడం వలన ఎక్కడ పనులు అక్కడే నిలిచి పోయాయి, అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమించాలని తద్వారా ప్రజల ప్రాణాలు కాపాడాలని మంగపేట మండలం ప్రజలు కోరుతున్నారు.





