మన్యం న్యూస్ బూర్గంపహడ్:-
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు,జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ల శాంతియుత సమ్మెకు గురువారం భద్రాచలం డిఎల్పిఓ ,మండల సర్పంచుల సంఘం, మండల పంచాయతీ కార్యదర్శులు సంఘీభావం తెలిపారు.పాల్వంచలోని కలెక్టరేట్ వద్దనున్న ధర్నా చౌకు దగ్గర వారు చేస్తున్న శాంతియుత సమ్మె లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు సర్పంచులు,కార్యదర్శులు మాట్లాడుతూ. … ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిదీ ఆన్లైన్ కావడంతో కంప్యూటర్ ఆపరేటర్ల అవసరం ఉందని అన్నారు.తమ పంచాయతీలు జాతీయస్థాయిలో అవార్డులు వచ్చేందుకు కంప్యూటర్ ఆపరేటర్ల కృషి ఎంతగానో ఉందని వారికి ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.వారు చేస్తున్న శాంతియుత సమ్మెకు తమ పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు.పెండింగ్ బిల్లులు రాక తాము ఇబ్బంది పడుతున్నామని కంప్యూటర్ ఆపరేటర్ల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వానికి విన్నవించారు.అనంతరం సర్పంచులు కార్యదర్శులు ఆపరేటర్లకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.ఆరవ రోజు సమ్మెలో భాగంగా బతుకమ్మల పేర్చి బతుకమ్మ మాట్లాడారు రంగోలి ముగ్గులతో నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఎల్ పిఓ పవన్,మండల సర్పంచుల సంఘం అధ్యక్షురాలు సిరిపురం స్వప్న,సర్పంచులు భూక్య శ్రావణి,దివ్యశ్రీ,కొయ్యల పుల్లారావు,సారపాక పంచాయతీ ఈవో మహేష్,బూర్గంపహాడ్ పంచాయతీ ఈవో సమ్మయ్య ,నాగినేని ప్రోలు పంచాయతీ కార్యదర్శి బాలయ్య,తాళగుమ్మూరు పంచాయతీ కార్యదర్శి మురళి,కార్యదర్శులు ఉపేందర్,సురేష్,వెంకటేష్,భవాని,తదితరులు పాల్గొన్నారు.





