UPDATES  

 ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ అండ్ యాంటీ ర్యాగింగ్ పై అవగాహన సదస్సు.

 

విద్యార్థుల చదువుకి పేదరికం అడ్డు కాదు.

మన్యం న్యూస్ బూర్గంపహడ్:-భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి జిల్లా షీ,టీమ్ బృందం,ప్రిన్సిపాల్ చీన్యా అధ్యక్షతన డ్రగ్స్ అండ్ యాంటీ ర్యాగింగ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ చిన్యా మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలంటే మత్తు పదార్థాలకు,గంజాయి,గుట్కా,జుదాలు లాంటి చెడు వ్యాసనాలకు అలవాటు పడకూడదు అని,అలవాటు పడి వీటికి బానిస కాకుండా,ఉండాలని పలు అంశాలపై అవగాహన కల్పించారు.అనంతరం షీ,టీమ్స్ ఇన్చార్జ్ పి.సతీష్ కుమార్ (సిఐ) మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మంచిగా ఆలోచిస్తే మంచి జరుగుతుందని,చెడుగా ఆలోచిస్తే చెడు బుద్ధులు అలవర్చుకుంటారని,మత్తు పదార్థాలైన గంజాయి,కొకై న్,సిగరెట్లు గుట్కాలకు బానిసవ్వకుండా దేశ భవిష్యత్తుకు మీ జీవితం ఉపయోగపడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.అనంతరం ఈ కార్యక్రమంలో ఉద్దేశించి షీ,టీమ్ (ఎస్ఐ) పి.రమాదేవి మాట్లాడుతూ విద్యార్థినీ,విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా సరే తన తల్లిదండ్రులకు,గురువులకు తెలుపుకోవాలని టీనేజ్ వ్యవస్థలో మీరు చెడు మార్గాలకు లోనవ్వకుండా ఉండాలని,ఉపాధ్యాయులు చెప్పుచున్న పాఠాలను క్షుణ్ణంగా చదువుకోవాలని చెడు వ్యసనాలకు లోను కాకుండా,సెల్ఫ్ రెస్పెక్ట్ తో జీవించాలి అని,చదువుకున్నట్లయితే ఉద్యోగం వచ్చి జీవితంలో స్థిరపడతారని జీవితమంటే ఒక ఉద్యోగం మాత్రమే కాదని,ఎవరికి నచ్చిన పనిని వాళ్ళ ఎంచుకొని ఆ పనిలో విజయం సాధించాలని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంనీ ఉద్దేశించి బూర్గంపహడ్ అదనపు ఎస్ఐ జి.యేసుబ్ మాట్లాడుతూ చదువుకి పేదరికం అడ్డు కాదని ప్రతి ఒక్క విద్యార్థి మంచి మార్గంలో ప్రయాణం సాగిస్తే భవిషత్తు కి బాటలు ఉంటాయి అని అన్నారు.ఈ కార్యక్రమంనీ ఉద్దేశించి ఏ,జిఎం,ఓ సిహెచ్ నాగేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థి ఉన్నత స్థితికి ఎదగాలంటే కళాశాలలో ఉపాధ్యాయులు చెపుతున్న మాటలు,చదువు,క్రమశిక్షణగా చెప్పినట్లు చదివినట్లయితే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పి ఓ జి.శ్రీనివాస్ పలువురు అధ్యాపకులు నాన్ టీచింగ్ స్టాఫ్,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !