UPDATES  

 సిండికేట్ దే హవా

సిండికేట్ దే హవా
*ఇస్టానుసారంగా మద్యం
విక్రయాలు.
* ఫుల్ బాటిల్ కు రూ. 40 ,క్వాటర్ కి రూ. 20 అదనపు వసూళ్లు.
* మద్యం అధిక రేట్లతో గుడుంబాకు అలవాటు పడుతున్న మద్యం ప్రియులు
* చోద్యం చూస్తున్న ఎక్సైజ్ శాఖ.
*మన్యం న్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్
మన్యం న్యూస్ ,
నూగూర్ వెంకటాపురం:
మండలంలోసామాన్యుడు కొనలేని విధంగా మద్యం ధరలు పట్టపగలే చుక్కలు చూపెడుతున్నాయి. వైన్ షాప్ యాజమాన్యాల దందా తో సామాన్యుడు మద్యం కొనేటట్టు లేదు. ఇష్టానుసారమైన రేట్లతో మద్యం బాబులను దోచుకుంటున్నారు. ఎమ్మార్పీ రేటు మీద ఉన్న రేటు కంటే 40 రూపాయలు అదనపు రుసుము వసూలు చేస్తూ మందు బాబులను దోచుకుంటున్నారు.
ఎక్సైజ్ శాఖ నిద్రమత్తు,జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో మద్యం దందాకు హద్దు అదుపు లేకుండా మండలంలో మూడు పూవులు ఆరు కాయలుగా మద్యం వ్యాపారం కొనసాగుతోంది.
మన్యం న్యూస్ స్ప్రింగ్ ఆపరేషన్
వెంకటాపురం మండలంలో హద్దు అదుపు లేకుండా సాగుతున్న మద్యం వ్యాపారంపై మన్యం న్యూస్ శుక్రవారం స్ప్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఎమ్మార్పీ కంటే మద్యం రేటుకు అధికంగా అమ్ముతున్న విషయం బట్టబయలైంది. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించి ఎమ్మార్పీ ధరలకు మద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేశారు.
ఇప్పటికే వెంకటాపురం మండల వ్యాప్తంగా కుటీర పరిశ్రమ లాగా గుడుంబా వ్యాపారం వ్యాప్తి చెందింది. అనేకమంది నిరుపేదలు గుడుంబాకు బానిసై రోగాల బారిన పడి మృతి చెందిన దాఖలాలు ఉన్నాయి. మద్యం ధరలు అధికంగా ఉండటమే గుడుంబా పెరగడానికి ఒక కారణంగా మండల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ అధికారులు దృష్టి సారించి మద్యం ఎమ్మార్పీ ధరలకే అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !