మన్యం న్యూస్ ,కారేపల్లి,(అక్టోబర్ 06):కారేపల్లి మండలం తులిశ్యాతండాకు చెందిన వాంకుడోత్ నందియా ఇటివల ఆనారోగ్యంతో మృతి చెందాడు.శుక్రవారం నందియా సంస్మరణ కార్యక్రమాన్నితులిశ్యాతండాలో నిర్వహించారు.ఈకార్యక్రమానికి బీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా నాయకులు అజ్మీర వీరన్న హాజరై వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్,ఐఆర్‌ఎస్ లావుడ్యా జీవన్‌లాల్ ఆదేశాలతో 50 కిలోల బియ్యం అందించారు.అనంతరం నందియా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించి కుటుంబాన్ని ఓదార్చారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు వాంకుడోత్ సుక్యా, భూక్యా కస్నా,వాంకుడోత్ కరణ్‌సింగ్, భూక్యా శంకర్,విజయ్,దేవా,రమేష్,వినయ్,హార్జ్యానాయక్, మంగ్యా, భద్రు తదితరులు ఉన్నారు.





