UPDATES  

 ట్రాఫిక్‌కు అంతరాయం కల్గిస్తే చర్యలు తప్పవు – భద్రాచలం ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ 

మన్యం న్యూస్ ,భద్రాచలం:
ట్రాఫిక్‌నకు అంతరాయం కల్గిస్తూ వాహనాలు పార్కింగ్‌ చేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాచలం ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాస హెచ్చరించారు. పట్టణం లోని పాత మార్కెట్, ఐటీడీఏ రోడ్డు తో పాటు ఇతర ప్రాంతా ల్లో రోడ్డుపై పార్క్ చేసిన లారీలను, ఆటోలను శుక్రవారం గుర్తించి వాటి నెంబర్‌ ఆధారంగా యజమానులకు ఈ–చలానా విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్‌ ఎస్‌ఐ శ్రీనివాస్ షాపుల నిర్వాహకులకు కూడా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రోడ్లపైకి షాపుల సరుకులను పెట్టవద్దని, నిర్ధేశించిన పార్కింగ్‌ ప్రదేశంలోనే వాహనాలు పెట్టే విధంగా షాపులకు వచ్చే ఖాతాదారులకు సూచించాలన్నారు. తోపుడు బండ్లు వ్యాపారులు కూడా ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా తమ వ్యాపారాన్ని చేసుకోవాలని, ట్రాఫిక్‌నకు ఎవరైనా అంతరాయం కల్గిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో ప్రతి ఒక్కరూ విధిగా ట్రాఫిక్ నిభందనలు పాటించి రోడ్డు ప్రమాదాలు దూరంగా ఉండాలని ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ ప్రజలకు, వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏఎస్ఐ లు, కానిస్టేబుల్స్, సిబ్బంది పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !