UPDATES  

 తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

స్వరాష్ట్రంలో బతుకమ్మను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం

– బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతరావు

మన్యం న్యూస్ మణుగూరు:

మణుగూరు మండలం లోని తహసీల్దార్ కార్యాలయం నందు ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ముఖ్యఅతిథిగా హాజరై స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విప్ రేగా కాంతరావు మాట్లాడుతూ, తెలంగాణ ఆడబిడ్డలకు పసుపు-కుంకుమ కింద సర్కారు సారెగా ప్రతి ఏటా బతుకమ్మ చీరెలను అందించి గౌరవిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతరావు అన్నారు.స్వరాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని,తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకున్నామని వారు తెలిపారు.ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలిచింది అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతరావు అన్నారు.దసరా,బతుకమ్మ పండుగకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆడపడుచుకు తెలంగాణ ప్రభుత్వం ఏటా చీరలు పంపిణీ చేస్తోంది అన్నారు.సుమారు 354 కోట్ల వ్యయంతో 1.02 కోట్ల చీరలను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు.జరీతో పాటు వివిధ రంగులలో 250 డిజైన్ల లో ఆకర్షణీయంగా చీరెలను రూపొందించారు అని,తీరొక్క పూలతో కొలిచే బతుకమ్మ పండగకు,తీరొక్క రంగులతో బతుకమ్మ చీరలను ప్రభుత్వం అందజేస్తోంది అన్నారు. అందరూ ఆనందోత్సవంతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా చీరలను పంపిణీ చేయడం జరుగుతుంది అని విప్ రేగా కాంతరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం. నరసింహారావు,ఎంపీపీ కారం విజయ కుమారి,పిఏసిఎస్ చైర్మన్ నాగేశ్వరరావు, తహసిల్దార్ రాఘవరెడ్డి,ఎండిఓ చంద్రమౌళి,మున్సిపల్ కమిషనర్,ఉమామహేశ్వరరావు,స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు,సర్పంచ్లు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !