చర్లలో అంతర్రాష్ట్ర మెగా క్రికెట్ టోర్నీ
బ్రోచర్ ఆవిష్కరించిన సిఐ రాజగోపాల్
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాల నుండిపాల్గొన్న క్రీడాకారులు
మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పాత చర్ల గడింకొట క్రీడా మైదానంలో రెండవ అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ యొక్క బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. రాజగోపాల్ చేతుల మీదుగా తాసిల్దార్, ఎంపీడీవో, ఈవో, సర్పంచ్, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. అనంతరం సిఐ రాజగోపాల్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన ఈ చర్ల మండలంలో ఇంత చక్కని భారీ అంతర్ ర్రాష్ట్ర మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో గొప్ప విషయం అని, ఈ టోర్నీ నిర్వహణకు శ్రీకారం చుట్టిన మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువత క్రీడలో రాణించాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి దోహదపడతాయని, యువత అసాంఘిక కార్యక్రమాలకు చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చదువులోనూ క్రీడల్లోనూ రాణించాలని ఆయన కోరారు. ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఈనెల 15 తేదీన ప్రారంభిస్తున్నట్లు క్రీడాకారులు తమ ఎంట్రీలను 13వ తారీకు లోపు 9505055020 నెంబర్కు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రంగు రమేష్, ఎంపీడీవో గద్దల రవీంద్ర ప్రసాద్, ఎస్సైలు పివిఆర్ సూరి, నర్సిరెడ్డి, సర్పంచ్ కాపుల కృష్ణ, ఎంపీపీ కోదండ రామయ్య, ఈవో కృష్ణ, బిఆర్ఎస్ అధ్యక్షులు సోయం రాజారాం, సిపిఎం మండల నాయకులు సురేష్, మచ్చ రామారావు కాంగ్రెస్ నాయకులు చీమలమర్రి మురళి, సీనియర్ క్రికెటర్ హిమగిరి యువత తదితరులు పాల్గొన్నారు.





