మన్యం న్యూస్ భద్రాచలం/ దుమ్ముగూడెం అక్టోబర్ 6::
అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అందించే పథకాలు వర్తింపజేయాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో మంగీలాలకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు పేదలకు అందడం లేదని కేవలం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కోసం మాత్రమే వర్తింప చేయడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ పథకాలను పేద ప్రజలకు ఇవ్వకుండా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చుకుంటూ అర్హులైన పేద ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నారని, రాజ్యాంగబద్ధంగా ప్రజలుచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధికి గౌరవం లేకుండా బిఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ జిల్లాలో అధికారులపై ఒత్తిడి తెచ్చి మరి వారి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు దోచిపెడుతున్నారని ఆరోపించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే వారి ఆటలు ఇక సాగనివ్వమని పేద ప్రజల సొమ్మును దోచుకుంటున్న బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ఎల్ఈఎం కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్, భద్రాచలం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరేష్, పిసిసి సభ్యులు శ్రీనివాస్, నల్లపు దుర్గాప్రసాద్, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు లంక అబ్బులు, విజయభాస్కర్ రెడ్డి, రవికుమార్, భోగాల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





