UPDATES  

 అమోనియా గుడుంబాకి బలైన యువకుడు. చోద్యం చూస్తున్న ప్రొబెషనరీ,ఎక్సైజ్ శాఖ అధికారులు

 

మండి పడ్డ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు.
*మృతుని కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్
మన్యం న్యూస్ ,బూర్గంపహడ్: బూర్గంపహడ్ మండల కేంద్రంలో గుడుంబా రక్కసికి వ్యక్తి బలైపోయాడు. పట్టుమని 30 సంవత్సరాలు నిండకుండానే ఆ నిండుప్రాణం హానికర అమోనియా గుడుంబా సారాయి సేవించి బంగారు భవిష్యత్తుని పాడు చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మండల కేంద్రంలో చితుచేసుకుంది.ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కేవి రమణ ఆ కుటుంబాన్ని పరామర్శించి యువకునికి శ్రద్ధాంజలి ఘటించారు.బూర్గంపహాడ్ మండలంలో ఎక్సైజ్,పోలీసు అధికారులకు ఎవరెవరు ఏ సామాజిక వర్గాల వారు గుడుంబా తయారీ అమ్మకాలు కొనసాగిస్తున్నారో పూర్తి సమాచారం ఉన్నప్పటికీని అటువంటి వారిపై ప్రభుత్వ అధికారులు కఠినమైన చట్టాలు పిడి యాక్ట్ వంటి చట్టాలను ప్రయోగించకపోవడం వలన యదేచ్చగా గుడుంబా తయారీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నాయని విమర్శించారు.అమాయక ప్రజలు తక్కువ ధరకు దొరుకుతుందని ఆశపడి గుడుంబా సారాయికి అలవాటు పడి అనంతరం తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.ఈ సారాయి తాగుడుకు బానిసై గుడుంబా సారాయి ఉత్పత్తి అమ్మకాలను పూర్తిగా నిషేధించుటలో అధికారులు వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది.ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా ఎక్సైజ్ అధికారులు హడావిడి మాత్రమే కనిపిస్తుంది అని ఆ తర్వాత యథా ప్రకారం ఈ గుడుంబా సారాయి ఉత్పత్తి,అమ్మకాలు బహిరంగంగా బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతుండగ ఏమి ఎరగనట్లు ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కొన్ని సామాజిక వర్గాల లోని కొందరు గుడుంబా తయారీని కుటీర పరిశ్రమగా ఎంచుకొని యువకుల ప్రాణాలు బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బూర్గంపహడ్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీ,పాండవ బస్తీ ,యాదవ బస్తి,చాకలి బస్తీ,ముస్లిం కాలనీ,ముధిరాజ్ కలనీ తదితర కాలనీలలో యువకులు,కుటుంబ పెద్దలు పదుల సంఖ్యలో గుడుంబా రక్కసికి బలైన కారణంగా ఒంటరైన మహిళలు చిన్నపిల్లలతో కుటుంబ భారాన్ని మోయలేక దిక్కుతోచని స్థితిలో దీనంగా కడుదయనీయంగా కాలాన్ని వెల్లదీస్తున్న పరిస్థితి కుటుంబాలలో నెలకొని ఉన్నది అయినను ప్రభుత్వ అధికారులు గుడుంబా తయారీ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోక తూతూ మంత్రంగా దాడులు నిర్వహిస్తూ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇందుకు బాధ్యులైన ప్రభుత్వ అధికారులపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కొసమెరుపు ఏంటంటే గుడుంబా సారాయి తయారీ తయారీ దారులతో ఎక్సైజ్ అధికారులు చీకటి ఒప్పందాలు చేసుకొని వారికి సహకరిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు దృష్టి పెట్టి వీరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేశారు.ఈ యువకుని అంతిమ కార్యక్రమం పలువురి దాతలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కె.వి రమణ,రాయల వెంకటేశ్వర్లు,ఇసంపల్లి వెంకటేశ్వర్లు,తోకల మోహన్రావు,తోకల ముత్యాలరావు,నందిపాటి పండు,కేసుపాక రాము,కేసుపాక మల్లేశ్వరరావు,అలవాల దుర్గ,కొడారి శ్రీనివాసరావు,చర్చి పాస్టర్ సుజా రావులు అంబేద్కర్ కాలనీ యువత పెద్ద ఎత్తున అంతిమ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !