మన్యం న్యూస్, గుండాల: మండల కేంద్రానికి చెందిన యువకులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించడంతో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షులు బెల్లం భాస్కర్, విభాగం అధ్యక్షులు సయ్యద్ అర్జున్ ఘనంగా సన్మానించారు. మండల కేంద్రానికి చెందిన గుండెబోయిన రాకేష్ ఫైర్ మాన్ తెలుగు సాధించగా, పూనెం సునీల్ తెలంగాణ స్టేట్ పోలీస్ ఉద్యోగాన్ని సాధించినట్లు వారు పేర్కొన్నారు. మీరు స్ఫూర్తి మిగతా యువతకు ఆదర్శంగా నిలుస్తుందని మండలంలోని యువకులు వీరి స్ఫూర్తితో ముందుకు సాగి ప్రభుత్వ కొలువులు సాధించాలని వారు అన్నారు. ఇంతటి పోటీలో కూడా ఉద్యోగం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మండలంలోని యువత పెద్ద ఎత్తున వారు ఆశ భావాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, నాయకులు నాగరాజు, ప్రమోద్, ప్రశాంత్, సతీష్, తిరుపతి, రాకేష్, నితీష్ తదితరులు పాల్గొన్నారు





