మన్యం న్యూస్ గుండాల: ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని తుడుం దెబ్బ కార్యదర్శిపు పూనెం శ్రీను, ఉపాధ్యక్షుడు వజ్జా ఎర్రయ్య కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మెకు పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని అన్నారు. కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని వారికి హెల్త్ కార్డు తో పాటు బీమా సౌకర్యాన్ని కల్పించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోవింద నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు





