ఆదివాసులకు నిత్యవసర వస్తువులు పంపిణీ
* ఏఎస్పీ పరితోష్ పంకజ్
*జె సి ఐ సంస్థ నెస్లే కంపెనీ సహకారంతో పోలీసుల ఆధ్వర్యంలో పంపిణీ
మన్యం న్యూస్ ,చర్ల:
మండలం కలివేరు రైతు వేదిక వద్ద చర్ల పోలీసు వారి ఆధ్వర్యంలో భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ సమక్షంలో మారుమూల ఏజెన్సీ గ్రామాలైన కందిపాడు, కుర్నపల్లి, ఎర్రబోరు, చెన్నాపురం, బూరుగుపాడు, తిప్పాపురం మొదలగు గ్రామాలలోని ఆదివాసులకు నిత్యవసర వస్తువులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఆదివాసి గిరిజనులకు జెసిఐ సంస్థ వారు నెస్ట్లే కంపెనీ సహకారంతో వంట వార్పుకి అవసరమయ్యే నిత్యవసర వస్తువులు పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమని ఫ్లడ్ ఏరియాలో ఆదివాసి గిరిజనులకు పోలీస్ వారి పూర్తి సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజగోపాల్, ఎస్ఐలు నర్సిరెడ్డి, సూరి, జే సి ఐ సంస్థ బృందం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.





