మన్యం న్యూస్ ,నూగురు వెంకటాపురం:
మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండల కేంద్రంలో సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఎఫ్ 39 ఆధ్వర్యంలో శనివారంమండల కేంద్రంలోని ప్రధాన వీధులలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ స్వచ్ఛభారత్ పై అవగాహన కల్పించారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలో ని ప్రభుత్వ వైద్యశాల ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించి స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో సిఆర్పిపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





