మన్యం న్యూస్,చండ్రుగొండ ,అక్టోబర్ 07: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు అప్రజస్వామికమైన చర్యయని మండల టిడిపి కమిటి విమర్శించింది. శనివారం మండల కేంద్రంలో టిడిపి మండల కమిటి ఆద్వర్యంలో నల్లబ్యాడ్జీలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ…. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన కొనసాగుతుందని ఆరోపించారు. ప్రజల కోసం పోరాడే నాయకుడు చంద్రబాబుని అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో టిడిపి నాయకులు కట్రం రామస్వామి, దారాది సత్యనారాయణ. కొడుమూరి సత్యనారాయణ, దడిగల మల్లేష్, చాపలమడుగు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.





