మన్యం న్యూస్,అశ్వారావుపేట( దమ్మ పేట), అక్టోబర్, 8: దమ్మపేట మండలం, గండుగుల పల్లి గ్రామంలో స్థానిక యువత, యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు హాజరై శిబిరాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ యువత సహకారంతో తరచూ రక్త దాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని ఇక ముందుకుడా తమ పరిధిలో వివిధ ప్రాంతాలలో రక్త దాన శిబిరాలు నిర్వహించాలని, ప్రతిరోజూ రక్తం అవసరం ఉండి ఎంతోమంది ఇబ్బందులకు గురౌతున్నారని, తలసేమియా, గర్భిణులు, ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పాట్లు పడుతున్నారన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జారే ఆదినారాయణ, బిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ మండవ సత్యనారాయణ, వసంత రావు, రమేష్, బానోత్ శ్రీను, నాని, వినోద్, నాగేంద్ర, శ్రీను, సురేష్, ప్రసాద్, రాజేష్ పాల్గొన్నారు.





