UPDATES  

 గోళ్ల ,కురుమల జీవితాల్లో వెలుగులు

గోళ్ల ,కురుమల జీవితాల్లో వెలుగులు
*సత్ఫలితాలిస్తున్న గొర్రెల పంపిణీ
*ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న ఎన్నో కుటుంబాలు
*గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకుగా చూశాయి
*ఎంపీపీ జల్లిపల్లి
గుర్రాల చెరువు లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ

మన్యం న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 08:గొల్ల, కురుమల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం సత్ఫలితాలిస్తున్నదనిగోళ్ల ,కురుమల జీవితాల్లో వెలుగులు నింపుతుంది ఎంపీపీ జల్లిపల్లి అన్నారు. మండలం పరిదిలోని గుర్రాల చెరువు గ్రామ పంచాయతీ నంధు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో అందించే గొర్రె పిల్లలను అశ్వారావుపేట నియోజక వర్గ శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వర రావు ఆదేశాల మేరకు ఆదివారం గొర్రె పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి ఉచిత గొర్రె పిల్లల పంపిణినీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుర్రాల చెరువు గ్రామ పంచాయతీ లో మొత్తం 17 యూనిట్ల గొర్రె పిల్లలను అందజేయటం జరుగుతుందని, దానిలో భాగంగానే ఈ గొర్రె పిల్లల పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఒక్కొక్క యూనిట్ కి 1,75000 రూపాయల విలువ చేసే 21 గొర్రె పిల్లలు ఉంటాయని, వీటి నిమిత్తం లబ్ధిదారులు తమ ఖాతాలలో 43750 రూపాయలు జమ చేసుకున్నారని మిగిలిన మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీతో చెల్లిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కలపాల. దుర్గయ్య, గోపాల కృష్ణ, గొర్రెల సంగం అధ్యక్షుడు వీర్రాజు, పశువుల డాక్టర్ స్వప్న, పసువర్ధక శాఖ సిబ్బంది మదర్, బాబ్జి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !