దళిత బంధుతో దళిత కుటుంబాల అభివృద్ధి
దళిత కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
ప్రభుత్వ విప్,రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పథకం అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు. నియోజకవర్గంలోని 1100 మంది లబ్ధిదారులకు ఎలిజిబిలిటీ వారిగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి క్యాస్ట్, ఇన్కమ్,బ్యాంక్ అకౌంట్ నెంబర్లను ఎండిఓ ఆఫీస్ లో ఇవ్వాలని వారు సూచించారు. దళిత కుటుంబాల ఆర్థిక ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం దళిత బంధు పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులందరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.





