మన్యం న్యూస్, వాజేడు:
వాజేడు మండలం చింతూరు గ్రామంలో జోరుగా గుడుంబా విక్రయాలు జరుగుతున్నాయి. విశ్వాసనీయ సమాచారం మేరకు వాజేడు పోలీసులు దాడులు నిర్వహించారు. కాగితాల దుర్గారెడ్డి, ములకల మోహనరావు,ములకల అర్జయ్య ల కిరాణం షాప్ లలో ప్రభుత్వం నిషేదించబడిన నాటు సారా విక్రయాలు జరుపుతున్నారు.ఈ నేపథ్యంలో కాగితాల దుర్గారెడ్డి షాప్ లో 20, లీటర్లు, ములకల మోహన్ రావు షాప్ లో 10, లీటర్లు, ములకల అర్జయ్య షాప్ లో 10, లీటర్ల చొప్పున మొత్తం 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. నిందితులను వాజేడు తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు.





