********************
మన్యం న్యూస్,ములుగు:
ములుగు పట్టణానికి చెందిన బీజేపీ పార్టీ ములుగు మండల మాజీ అధ్యక్షుడు, ఎంబీసీ కులాల ములుగు జిల్లా అధ్యక్షులు బాణాల రాజ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఆయనను ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.అనంతరం వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి గ్రామానికి చెందిన బీజేపీ పార్టీ వెంకటాపూర్ మండల ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పల్లేర్ల సతీష్,బీజేపీ పార్టీ మండల మాజీ కార్యదర్శి బోడ నవీన్, బీజేపీ పార్టీ పాపయ్యపల్లి గ్రామ మాజీ కార్యదర్శి బోడ రాజేందర్ బీజేపీ పార్టీ మాజీ సీనియర్ నాయకులు జక్కినపెల్లి నర్సయ్య, గొట్టిముక్కల సుధాకర్ రెడ్డి,ఇజ్జిగిరి మహేందర్, మాజీ మహిళా సీనియర్ కార్యకర్తలు జక్కినపెల్లి రాజమ్మ, జక్కినపెల్లి దేవమ్మ బోడ కవిత గార్లు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్, ఎంపిపి గండ్రకోట శ్రీదేవి సుదీర్, మండల పార్టీ అధ్యక్షులు బాదం ప్రవీణ్ , ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు విజయరాం నాయక్, బైకాని సాగర్ , ఎంపిటిసి ముడుతనపల్లి మోహన్, దొడ్డెపల్లి రఘురాం , గడ్డమీది భాస్కర్ బైకని ఓదెలు తదితరులు పాల్గొన్నారు.





