మన్యం న్యూస్ చర్ల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల నూతన తహసిల్దార్ గా ఆర్.అనంత రామకృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆయనను చర్లకు బదిలీ చేసారు. 2023లో జూనియర్ అసిస్టెంట్ గా మండలంలో విధులు నిర్వహించిన అనుభవం ఉన్నది. ప్రస్తుతం తహసిల్దార్ గా విధులు నిర్వహించిన రంగు రమేష్ ను కలెక్టర్ కార్యాలయంలో సి సెక్షన్ కు బదిలీ చేసారు.





