🔥🔥🔥🔥🔥🔥🔥
అభివృద్ధిని గెలిపించండి
* పినపాక ప్రగతి ఆయన ఘనతే
* కృషి చిత్తశుద్ధి ఉన్న నేత రేగా
* కాంతారావు పట్టుదలను చూసి సీఎం కితాబు
* మళ్లీ రేగాను గెలిపించుకోండి
* అభివృద్ధిని కొనసాగించుకోండి
* బిఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి
* కార్యకర్తల సమావేశంలో మహబూబాద్ ఎంపీ మాలోత్ కవిత
మన్యం న్యూస్ పినపాక:
గత పాలకుల హాయంలో వెనుకబడి ఉన్న పినపాక నియోజకవర్గం నేడు విద్యుత్ వెలుగుల మధ్య దగదగాలాడుతుందంటే అది పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యువనేత మన్య ముద్దుబిడ్డ రేగా కాంతారావు పుణ్యమేనని మహబూబాద్ జిల్లా ఎంపీ మాలోత్ కవిత కితాబిచ్చారు. మంగళవారం బీ.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి అధ్యక్షత ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మండల పార్టీ కార్యాలయాన్ని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుతో కలిసి ఎంపీ మాలోత్ కవిత ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యకర్తల సమావేశంలో మాలోత్ కవిత మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంను ఎమ్మెల్యే రేగా కాంతారావు నలు దిక్కుల అభివృద్ధి చేయడం జరిగిందని ఈ ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ కు రేగా కాంతారావు అత్యంత సన్నితుడిగా ఉంటారని ఈ సన్నిహితంతోనే సీఎం కేసీఆర్ తో రేగా మాట్లాడి అధిక నిధులను కేటాయించుకొని పినపాక ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి ప్రదాతగా ముద్ర వేసుకున్న కాంతారావుని మరోసారి గెలిపించుకొని అభివృద్ధిని కొనసాగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేగాకు విప్ పదవితో పాటు భారస భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాధ్యతలు సైతం అప్పజెప్పడం జరిగిందన్నారు. ప్రతిక్షణం తాను నమ్మిన ప్రజల అభివృద్ధి కోసం తపించే గొప్ప నాయకుడు ఎమ్మెల్యే రేగా అని అన్నారు. పినపాక నియోజకవర్గంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళిన అభివృద్ధి కళ్ళకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుందని అన్నారు. ఇంత గొప్ప నాయకుడు ఉండడం పినపాక నియోజకవర్గం ప్రజల అదృష్టమన్నారు. సీఎం సర్వేలలో ఇప్పటికే రేగా కాంతారావు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని స్పష్టమైన సమాచారం ఉందన్నారు. ఒకవైపు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు, మరోవైపు ఎమ్మెల్యే రేగా అభివృద్ధి పనులు రేగను భారీ మెజారిటీతో గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. తడబడితే పినపాక నియోజకవర్గం మరల 40 సంవత్సరాలు వెనకకు పోతుందని అన్నారు. ఏజెన్సీ సమస్యల పరిష్కారం కోసం విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన కృషి మరువలేనిదన్నారు. ముఖ్యంగా పోడు భూముల సమస్య పరిష్కారం కొరకు ఎమ్మెల్యే రేగా ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా ఎంపీ కవిత గుర్తు చేశారు. పినపాక నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడవాలంటే ఎమ్మెల్యే రేగా కాంతారావు గెలుపు అనివార్యం అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆ ప్రభుత్వంలో రేగ కాంతారావుకు క్యాబినెట్ పదవి దక్కుతుందని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలన్నారు.
అభివృద్ధిని చూడండి: ప్రభుత్వ విప్ రేగ..
పినపాక నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి మరోసారి తనను గెలిపించి అభివృద్ధిని మరింత కొనసాగించుకోవాలని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు డ్రైనేజీలు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు వంటి అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందన్నారు. విద్య వైద్య రంగాన్ని సైతం అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లడం జరిగిందన్నారు.
ఇన్చార్జీలు సైనికుల వలె పనిచేయాలి..
బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పినపాక నియోజకవర్గం లో ప్రతి100 ఓటర్లకు ఇన్చార్జిలను నియమించడం జరిగిందని బాధ్యతగా ప్రతి ఇన్చార్జి సైనికులు పనిచేయాలని కోరారు. అని నిత్యం ఓటర్లతో మమేకమై బారాస పథకాలను ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. ఇన్చార్జీలు ఐక్యతతో పనిచేయాలని అన్నారు.
రేగాతోనే నా పయనం:కోలేటి భవాని శంకర్
నా ప్రాణం ఉన్నంతవరకు ఎమ్మెల్యే రేగాతోనే రాజకీయపైన ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు లాంటి ఎమ్మెల్యేని చూడలేదన్నారు. తనపై కొంతమంది కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని… ప్రాణం పోయినా పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. రేగా కాంతారావు భారీ మెజారిటీతో గెలిపించే వరకు విశ్రమించనని, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
రేగా గెలుపుతో మరింత అభివృద్ధి… పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయాలలోనే పినపాక నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టిందని బీఆర్ఎస్ నాయకులు, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి అన్నారు. పినపాక నియోజకవర్గంలో 75 శాతం అభివృద్ధి జరిగిందని మిగతా ఉన్న 20 శాతం అభివృద్ధి జరగాలంటే కేవలం రేగా తోనే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ,ఆత్మ కమిటీ డివిజన్ అధ్యక్షులు పోనుగోటి భద్రయ్య,ప్యాక్స్ చైర్మన్ డా.వర్మ ,రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి,బీ. ఆర్.ఎస్ నాయకులు కటకం గణేష్,దాట్ల వాసుబాబు,కొండేరు రాము,కామేశ్వరరావు,కొండేరు నాగ భూషణం,ఎంపీటీసీ కాయం శేఖర్,బీ. ఆర్. ఎస్ పార్టీ ఎంపీటీసీ, సర్పంచ్ లు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు ,సోషల్ మీడియా అధ్యక్షులు శ్యామల సతీష్ తదితరులు పాల్గొన్నారు.