మన్యం న్యూస్ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మణుగూరు డిఎస్పి రాఘవేంద్రరావు పర్యవేక్షణలో మణుగూరు పట్టణంలో వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా,నంబర్ కనిపించకుండా చేసి తిరుగుతున్న,వాహనాలను పట్టణంలో వైట్ లైన్ దాటి రోడ్ల పైన పార్కింగ్ చేసిన వాహనాలను గుర్తించి సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరుగుతుందని అని సిఐ రమాకాంత్ తెలిపారు. అంతేకాకుండా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోని కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ఇకపై ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడుతుందని కావున వాహనదారులు అందరూ తమ తమ వాహనాల పత్రాలు,సక్రమంగా ఉండేటట్టు చూసుకొని,పోలీసు వారికి సహకరించాల్సిందిగా సిఐ రమాకాంత్ కోరారు.