మన్యం న్యూస్, మంగపేట:మండలం లోని రాజుపేట గ్రామంలో మండల సీనియర్ నాయకులు తుమ్మల ముఖర్జీ ఇంటి వద్ద గ్రామ పార్టీ అధ్యక్షులు పొట్రూ సమ్మయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు.
ఎన్నికలు ముందే ప్రత్యక్షమవుతున్న అధికార పార్టీ నాయకులు సీతక్కని ఓడించడమే ధ్యేయంగా డబ్బుల సంచులతో వస్తున్నారు,నన్ను ఓడించడానికి కారణమేంటి ప్రతి క్షణం ప్రజల మధ్యలో ఉంటున్న నేను నియోజకవర్గ ప్రజల కోసం ప్రతిక్షణం ప్రజల పక్షాన ప్రశ్నించినందుకా, అన్ని సందర్భాలలో ప్రజల కష్టాలను పాలుపంచుకున్నందుకా, నియోజకవర్గ ప్రజల పక్షాన గిరిజన యూనివర్సిటీ కావాలని అడిగినందుకా , 2014 నుండి ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో మల్లంపల్లి మండలం చేయాలని, ఏటూరు నాగరాణి రెవిన్యూ డివిజన్ చేయాలని, రాజుపేటను కూడా మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక రాజుపేట ను మండలం గా ప్రకటిస్తాం అని సీతక్క ప్రజలకు తెలియజేశారు.సీతక్క ప్రజలను ఉద్దేశించి నియోజకవర్గమే కుటుంబం అని నియోజకవర్గ ప్రజలే నా కుటుంబ సభ్యులని ప్రతి ఇంటి బిడ్డల కష్టసుఖాల్లో తోడవుతానని, ప్రజల కష్ట సుఖలలో పాలుపంచుకుంటానని తెలియజేశారు.హైదరాబాదులోని తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగ సభలో సోనియా గాంధీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ హామీలను అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఖచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని మాట తప్పే అలవాటు, మడమతిప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఈ సందర్బంగా ప్రజలను కోరారు.
