మన్యం న్యూస్ ఇల్లందు రూరల్ – రొంపేడు గురుకుల బాలికల పాఠశాల నందు మంగళవారం న్యాయ చైతన్య సదస్సు జరిగింది. హై కోర్టు , జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశాలతో మండల న్యాయ సేవాదికార సంస్థ చైర్మన్ దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలికలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కష్టపడి బట్టి పద్దతిలో కాకుండా ఇష్టపడి జీవితానికి ఉపయోగపడే విధంగా అర్థవంతంగా చదవాలని విద్యార్థులకు సూచించారు.18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయని చూస్తే ఎవరూ చేసుకోవద్దు అంటూ పిల్లలకు సూచించారు.18 యేళ్ళ లోపు ఆడపిల్లకు పెళ్లి చేయాలని చూసే కుటుంబ సభ్యులు, బందువులు శిక్షార్హలు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మామిడి సత్య ప్రకాష్, జాయింట్ సెక్రెటరీ కీర్తి కార్తిక్ ట్రెజరర్ ఉమామహేశ్వరరావు గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం, ఎల్. రవి, పిడి శిరోమణి, పార్వతీ, భద్రమ్మ, టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు