ఎమ్మెల్యే హరిప్రియకు సీఎం కేసీఆర్ ఫోన్ హరిప్రియకు సీఎం కేసీఆర్ అభయం నవంబర్ 1న ఇల్లందులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగసభ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మన్యంన్యూస్,ఇల్లందు:బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం మధ్యాహ్నం ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ పరిస్థితులపై సీఎం ఎమ్మెల్యే హరిప్రియను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ది చేయటంలో, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమఫలాలను అందించడంలో సఫలీకృతం అయ్యారని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరింతగా ప్రజల్లో ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1న ఇల్లందులో భారీ బహిరంగసభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని, అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారని ఎమ్మెల్యే హరిప్రియ తెలిపారు. రానున్న ఎన్నికల్లో తాను మరోమారు ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కేసీఆర్ కు కానుకగా ఇవ్వటం ఖాయమని ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ తెలిపారు.
