- బిఆర్ఎస్ లో చేరికలు
- అభివృద్ధి,సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరిక
- కండువా కప్పి ఆహ్వానించిన ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని పద్మశాలి భవన్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మణుగూరు పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ చెందిన 20 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఎమ్మెల్యే రేగా కాంతరావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు బిఆర్ఎస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరుతున్నారని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు,రైతు బీమా,కల్యాణ లక్ష్మి,షాది ముబారక్,పెన్షన్లు, మహిళలకు కెసిఆర్ కిట్టు,న్యూట్రిషన్ కిట్లు, అందిస్తున్న తీరును చూసి ఇతర పార్టీ ముఖ్యమంత్రులు తెలంగాణను ఆదర్శవంతంగా తీసుకుంటున్నారని తెలిపారు. త్వరలో జరిగే ఎన్నికలలో గులాబీ జెండా విజయం నల్లేరు పై నడికేనని బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కాయమని,మూడో సారి సీఎం కేసీఆర్ కే పట్టం కట్టేదెందుకు యావత్ తెలంగాణ ప్రజానీకం సిద్ధంగా ఉన్నదని అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు పార్టీ ముఖ్య నాయకులు యాదగిరి గౌడ్,వట్టం రాంబాబు,ఉద్దండు,వెంకటేశ్వర్లు,నరసింహారావు,అన్నారం గ్రామస్తులు గంట భాస్కరరావు,బేతమ్ కుమారి, సాధనపల్లి జయమ్మ,ఎన్న దేవి, గంట కృష్ణవేణి,కొరగట్ల పద్మ, తదితరులు పాల్గొన్నారు.