మన్యం న్యూస్,భద్రాచలం:భద్రాచలం శ్రీ శ్రీ రాములోరిని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత బుధవారం ధ్వజస్తంభాన్ని ప్రధానాలయానికి చేరుకొని మూల విరాట్‌ను దర్శించారు. గోత్రనామాలతో అర్చన చేసి, కేశవ నామార్చన నిర్వహించారు. అక్కడ నుంచి ఇదే ప్రాంగణంలో ఉన్న లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని, తెలంగాణ రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని రాములోరిని వేడుకున్నట్లు ఎంపీ కవిత తెలిపారు.
