మన్యం న్యూస్ ,వాజేడు:
మండల పరిధి బొల్లారం గ్రామంలో ఎస్సై వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారంకమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.గ్రామంలో యువత చెడు వ్యసనాలకు బానిసలు కావొద్దని, క్రమశిక్షణతో విద్య అభ్యసించిన విద్యార్థులు ఉన్నతమైన అవకాశాలు వస్తాయని ఎస్సై తెలిపారు.గ్రామాలలో అక్షరాస్యత శాతం తక్కువగా నమోదు అవుతుందని తల్లిదండ్రులు పిల్లలపట్ల శ్రద్ధ వహించాలని కోరారు. గ్రామంలో గ్రామ పరిసర ప్రాంతాలలో ఎవరైనా అనుమానితులు, అదృశ్య వ్యక్తులు, సంచరిస్తూ కనిపించిన పోలీస్ శాఖకు తెలియజేయాలని కోరారు.ఏదైనా సమస్య కై పోలీస్ స్టేషన్ కి రావాల్సి వస్తే ఎటువంటి మద్యవర్తులను సంప్రదించకుండా నేరుగా పోలీసుస్టేషన్ కి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలని, అలాగే ఇతర ఏ శాఖకి చెందిన సమస్యలు ఉన్నా వాజేడు పోలీస్ వారిని సంప్రదించినట్లైతే ఇతర శాఖ అధికారుల సమన్వయం తో సహాయం చేయుటకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలియజేయజెచేరు. గుడుంబా లాంటి మహమ్మరిని ఊర్లో తయారుచేయడం, బయటనుండి తెచ్చి అమ్మడం, చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఈ కార్యక్రమములో సివిల్ కానిస్టేబుల్, సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ,గ్రామస్తులు పాల్గొన్నారు.