మన్యం న్యూస్, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామ పంచాయతీ లో గడప గడప కు బిఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం జరిగింది.ఈ సందర్భంగా బీ. ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని ,గత తొమ్మిదిన్నర ఏండ్లుగా ప్రజా సంక్షేమం ధ్యేయంగా పాలన సాగిస్తున్నారు.రానున్న ఎన్నికలలో మూడోసారి బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించేలా ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కృషి చెయ్యాలి పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని వివరించారు.రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు ఉచిత విద్యుత్ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పింఛన్లు కేసీఆర్ కిట్టు ,వీటితో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు,రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సమన్వయం చేయడంతో పాటు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటి ప్రచారం చేసేలా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి అని అన్నారు.రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు సమయత్వం కావాలి.రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను అందరికీ తెలిసేలా ఇంటింటికి వెళ్లి వివరించాలి కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృతంగా ప్రచారం కమిటీలు అందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి అన్నారు.ఎమ్మెల్యే రేగా కాంతారావు ని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త పని చెయ్యాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మల్లెలమడుగు గ్రామ శాఖ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మామిడి శ్రీనివాస్, గ్రామ యువజన బిఆర్ స్ పార్టీ నాయకులు ఈసంపల్లి పున్నరవు,మందా హుస్సేన్,కడారి వేణు,గొడ్డుగొర్ల వెంకన్న,జినాక ప్రభాకర్,మండ్రు నరహీంహారావు,దాసరి రాజా,భేతం నవీన్,కడారి హుస్సేన్,బలగాని జగన్నాథం,సురేష్,సైదులు,తదితర నాయకులు పాల్గొన్నారు.
