మన్యం న్యూస్: జూలూరుపాడు, అక్టోబర్ 12, అడవి జంతువులను వేటాడుతున్న వేటగాళ్లకు నాటు తుపాకులు అమ్ముతున్న వ్యక్తిని జూలూరుపాడు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సూరారం అటవీ ప్రాంతంలో నాటు తుపాకులతో పోలీసులకు పట్టుబడ్డ నలుగురు వ్యక్తులను విచారించగా చండ్రుగొండ మండలం పోకలగూడెం గ్రామానికి చెందిన భూక్య హరి అనే వ్యక్తి వద్ద నాటు తుపాకులు కొన్నామన్న సమాచారంతో పోలీసులు హరి కోసం గాలించగా, పరారీలో ఉన్న హరి మండల పరిధిలోని నల్లబండబోడు అటవీ ప్రాంతంలో ఉన్నాడన్న సమాచారంతో గురువారం పోలీసులు హరిని వెంబడించి పట్టుకున్నట్లు తెలిపారు. భూక్య హరి వద్ద నుండి ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గతంలో కూడా భూక్య హరి పై నాటు తుపాకులకు సంబంధించిన రెండు కేసులు నమోదయాయనీ అన్నారు. నేరస్తుడిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై బి పురుషోత్తం తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.