మన్యం న్యూస్: జూలూరుపాడు, అక్టోబర్ 12, దసరా పండుగ సందర్భంగా విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తారీకు నుండి పాఠశాలలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మండల పరిధిలోని పలు ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలసి ముందస్తు బతుకమ్మ సంబరాలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పెండ్యాల భాగ్యమ్మ మెమోరియల్ ప్రాథమిక పాఠశాల, పడమట నర్సాపురం లోని వశిష్ట విద్యా మందిర్ లో సహజ సిద్ధమైన పూలతో బతుకమ్మలు పేర్చి ఆయా పాఠశాలల్లోని క్రీడా ప్రాంగణాలలో బతుకమ్మ ఆటపాటలతో అలరించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తెలంగాణ సాంప్రదాయ వస్త్రాలంకరణతో బతుకమ్మ సంబరాలలో పాల్గొని ఆడి పాడడం చూపరులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, పాఠశాల సిబ్బంది గీత, భాస్కర్, సీతారాములు, విజయలక్ష్మి, స్వర్ణ, వశిష్ట విద్యా మందిర్ కరస్పాండెంట్ ఎనుముల శ్రీనివాస్ తోపాటు పాఠశాల సిబ్బంది అరుణ, కౌసర్, సుమిత్ర, సౌమ్య, నందిని, నిరోష, భార్గవి, శాంతి, రత్నకుమారి, వాణి, లావణ్య, దివ్య, తులసి తోపాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.