UPDATES  

 రేగా వ్యూహం…ప్రత్యర్థి బేజారు

*సీఎం కేసీఆర్ మనసే దోచుకున్న ఆదివాసీ బిడ్డ రేగా
*ప్రతిపక్ష పార్టీల పైముప్పేట దాడి చేస్తున్న గులాబీ శ్రేణులు,రేగా దళం
*రెండో సారిఎమ్మెల్యే గా గెలిచిన తొలి రోజు నుండి కార్యకర్తలతో మమేకం
*కారోన కష్ట కాలం లో నియోజకవర్గ ప్రజలకు కోట్ల రూపాయల వితరణ కార్యక్రమాలు
*తనిని నమ్ముకున్న ప్రతి ఒక్కరి కి అండగా నిలిచిన రేగా
*రూ. వందల కోట్ల తో ఔరా అనేలా పినపాక నియోజకవర్గ అభివృద్ధి
* రానున్న ఎన్నికలలో రేగాను ఎదుర్కోవడానికి జంకుతున్న ప్రత్యర్ధులు
*రేగా విజయం తధ్యం అంటున్న బీ. ఆర్.ఎస్ శ్రేణులు
మన్యం న్యూస్,పినపాక:పై వారితో గౌరవం గా,సాటి వారితో స్నేహంగా మెలగడం కాదు,తన కన్న తక్కువ వారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. ఈ మంచి మాట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు,విప్ , పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వర్తిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండుసార్లు ఎమ్మెల్యే గా ఎన్నికైన ముచ్చటగా మూడు పదవులు చేతిలో ఉన్న చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం రేగా కాంతారావు ది. ఇలాంటి వ్యక్తి రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యర్థులకు సవాలు విసురుతూ… ఈరోజు కా రోజు ప్రత్యేక వ్యూహాలు పన్నుతూ ప్రత్యర్ధులను బేజారు పెట్టిస్తున్నాడు. ఇది ఒక్కరోజు రెండు రోజుల నుండి అనుకుంటే పొరపాటే. ఒక వ్యాయామ ఉపాధ్యాయుడిగా కరాటే మాస్టర్ గా టీంను ఎలా నడిపించాలో ఆ సమయంలోనే ఒంట పట్టించుకున్నాడు. అది వచ్చిన అవకాశంతో తొలిసారిగా స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు అనే మాటలతో ప్రేరణ పొందిన రేగా కాంతారావు పినపాక నియోజకవర్గ ప్రజల కష్టాలను కళ్లారా చూసి చలించారు. తనను ప్రజలు ఎమ్మెల్యే ఆశీర్వదించడంతో … ఎవరికి తలొగ్గకుండా… బాంచన్ దొర అనే పదాన్ని ఆనాడు తనకున్న పరిజ్ఞానంతో వందల కోట్ల విలువైన అభివృద్ధి పనులను పినపాక నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మణుగూరు 100 పడకల ఆసుపత్రి, ఇంటింటికి నల్ల, ముఖ్యమైన గ్రామాలకు బీ. టి రోడ్డు , పినపాక మండలంలో ఏడుల్ల బయ్యారం నుండి రంగాపురం వరకు కోట్ల రూపాయలతో నిర్మించిన రెండు వరసల రహదారి, ఐలాపురం లో కోట్ల రూపాయలతో నిర్మించిన బాలికల వసతి గృహాలు , సింగిరెడ్డిపల్లి లిఫ్ట్ ఇలా అనేక ప్రజా ఉపయోగకరమైన పనులు తొలిదఫా ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలోనే పూర్తి చేశారు. ఆనాడు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చెరువుతో పినపాక నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గ అనే ఒక భావన అధికారులలో ఉండేది. అలాంటి నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పథంలో నడిపించారు. మారుమూల నియోజకవర్గమైన పినపాలో పోస్టింగ్ దొరికితే ఒక అదృష్టం అనే భావన అధికారులకు వచ్చేలా కృషి చేశారు. తన హయాంలో ఏ ఒక్క మండలాన్ని నిర్లక్ష్యం చేయలేదు. పినపాక ,మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, గుండాల మండలాలలో సమాంతర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి నిధులు రాబట్టి పిరపాకను అభివృద్ధి పథం లో దూసుకు వెళ్లడానికి మార్గం వేశారు.కాని ఆనాడు ఎమ్మెల్యే రేగా స్పీడ్ హస్తం పార్టీలో ఉన్న కొంతమంది అగ్ర నేతలకు నచ్చలేదు. తరువాత ఎన్నికలలో సిపిఐ పార్టీ గెలవదు అని తెలిసినప్పటికీ పొత్తులలో భాగంగా సిట్టింగ్ టిక్కెట్ ని ఎమ్మెల్యే రేగా కాంతారావు వదులుకున్నాడు. కానీ తన లక్ష్యాన్ని వీడలేదు. ఐదు సంవత్సరాల పాటు కార్యకర్తలకు అండగా నిలుస్తూ వారికి అనుక్షణం టచ్ లో ఉండేవారు. అదే 2018లో రేగా కాంతారావు కు కలిసి వచ్చింది. మరో దఫా పినపాక నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని వమ్ము చేయకుండా నియోజకవర్గ ఎక్కడ వెనుకబాటుతనానికి గురవుతుందోనని కార్యకర్తలతో చర్చించిన అనంతరం రాజ్యాంగబద్ధంగా టిఆర్ఎస్ పార్టీలో విలీనమయ్యారు. పినపాకే రేగా… రే గానే పినపాక అనే స్థాయిలో ప్రజలు చర్చించుకునే విధంగా వందల కోట్ల రూపాయల నిధులను తీసుక వచ్చి పినపాక నియోజకవర్గం ప్రజలు ఔరా అనే విధంగా సందు రోడ్లను సీసీలుగా మార్చారు. అలాగే పలు గ్రామాలకు బీటీ రోడ్లు సైతం మంజూరు చేయించారు. పనులు సైతం ఉద్యమంల కొనసాగుతున్నాయి. ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గడపగడపకు సంక్షేమం ఉందని ఇల్లు లేదు. మరోవైపు రేగా కాంతారావు వివిధ మార్గాలలో నిధులను రాబట్టి పల్లెలను అభివృద్ధి పథంలో నడిపించారు. కరోనా సమయములో ప్రపంచం అంత అల్లాడుతున్న రేగా కాంతారావు మాత్రం ప్రజలకు అండగా నిలిచారు. కోట్ల రూపాయల అత్యవసర సరుకులు పంపిణీ చేయడంతో పలు గ్రామాలకు రేగా విష్ణు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు. రోగాల బారిన పడిన అనేకమంది నిరుపేదలు ప్రైవేటు వైద్యం చేయించుకుని అప్పుల పాలు కాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించి వారికి అండగా నిలిచారు. పెద్ద పెద్ద వైద్యాలకు డబ్బులు లేక నా అనేవారు పట్టించుకునే వారు లేక అనేకమంది దేవుళ్లకు మొక్కిన వారి కోరిక నెరవేరలేదు. కానీ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవతో పినపాక నియోజకవర్గంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అనేకమంది రోగులకు కోట్ల రూపాయల విలువైన ఎల్ఓసిలు ఇప్పించి వారికి పునర్జన్మని ఇచ్చారు. ఆదివాసి బిడ్డలు పడుతున్న కష్టాలను చూసి చెలించి సీఎం కేసీఆర్ ని మెప్పించి వారికి పోడు భూములకు పట్టాలు ఇప్పించారు. సుమారు వందలాదిమంది నిరుద్యోగ దళిత యువతకు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా లబ్ది జరిగేలా వారికి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అయినప్పటికీ కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఇష్టా రీతిన తప్పుడు ఆరోపణలు చేయడంతో ఎమ్మెల్యే రేగా సైతం గట్టిగా స్పందించేవారు. ఒకవైపు సోషల్ మీడియా వేదికగా క్షణాలలోనే వారి కి సమాధానం చెప్పడం తో పాటు… తన సైన్యాన్ని అలాగే సిద్ధం చేశారు. రేగ వ్యూహాలతో ప్రత్యర్థి బేజారవుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రేగా కాంతారావు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమాతో బీ. ఆర్.ఎస్ శ్రేణులు ఉన్నారు.ఇప్పటి సీఎం కేసీఆర్ నిర్వహించిన సర్వేలలో సైతం రేగా కాంతారావు 50 వేల మెజార్టీతో గెలవనున్నట్లు నివేదికలు రావడం జరిగింది. రేగ చేసిన అభివృద్ధి, సామాజిక కార్యక్రమాలు, కార్యకర్తలకు అండగా ఉన్న తీరు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో విజయతీరాలకు చేరుస్తాయని రేగ అభిమానులు మాట్లాడుకోవడం జరుగుతుంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !