మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
నవభారత్ లిమిటెడ్ పాల్వంచ సామాజిక బాధ్యత కార్యక్రమాలలో భాగంగా
బొల్లోరిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవ లిమిటెడ్ సహకారంతో బాలుర కొరకు
నిర్మించిన “మూత్రశాలలను” జిల్లా విద్యాశాఖాధికారి యం.వేంకటేశ్వరాచారి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీ ట్యూటోరియల్స్ జంటబల్లల
వితరణ మొబైల్ సైన్స్ ల్యాబ్స్ సప్లమెంటరీ స్పోకేన్ఇంగ్లీషు కంప్యూటర్ ఫ్యాకల్టీఏర్పాటు
డిజిటల్ పరికరాలు అందజేయడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి
నవ లిమిటెడ్ చేస్తున్న కృషిని అభినందించారు.
ఈ కార్యక్రమానికి చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్, విద్యాశాఖ సైదులు,
డి.జి.యం, హెచ్.ఆర్ శంకరయ్య, చీఫ్ అడ్మినిస్ట్రేటర్, డి.శ్యామసుందర్,
పాఠశాల హెచ్.యం కె.మంగమ్మ, టీచింగ్ సిబ్బంది. సి.యస్.ఆర్ సిబ్బంది
విద్యార్ధులు పాల్గోన్నారు.
ఉచిత వైద్య శిబిరం…
ప్రపంచ దృష్టి దినోత్సవ
సందర్భంగా ఉచిత నేత్ర వైద్యశిబిరాన్ని నిర్వహించారు. నవభారత్ ఉన్నత
పాఠశాల తెలుగు మీడియం విద్యార్ధిని విద్యార్థుల కొరకు నవభారత్ నేత్ర వైద్య కేంద్రం
పాల్వంచ వారి సహాయంతో ఏర్పాటుచేయడం జరిగింది. ఈ సందర్భంగా నవభారత్ నేత్ర వైద్య కేంద్రం అడ్మినిస్ట్రేటర్ యు.విజయకుమార్ మాట్లాడుతూ విద్యార్ధిని విద్యార్థులు కొరకు కంటిపరీక్షలు నిర్వహించిన అనంతరం అవసరమయ్యే విద్యార్థులకు కళ్ళజోళ్ళను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి డి.జి.యం, హెచ్.ఆర్. శంకరయ్య, చీఫ్ అడ్మినిస్ట్రేటర్
సి.యస్.ఆర్. డి.శ్యామసుందర్, పాఠశాల హెచ్.యం జ్యోతి, టీచింగ్ సిబ్బంది, సి.యస్.ఆర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.