మన్యం న్యూస్ అశ్వాపురం: మండల పరిధి మొండికుంట కె.వి.ఆర్ ఫంక్షన్ హాల్ లో అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ గజ్జి లోహిత్ యాదవ్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంచుకట్ల వీరభద్రం,ఎంపీటీసీలు,గ్రామపంచ యితీలో సర్పంచులు,ఉప సర్పంచ్లు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్,ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్ ,యువజన విభాగం అధ్యక్షులు గద్దల రామకృష్ణ ,మండల నాయకులు ,యువజన నాయకులు ,కార్యకర్తలు ,అభిమానులు , తదితరులు పాల్గొన్నారు.