మన్యం న్యూస్ దుమ్ముగూడెం అక్టోబర్ 12::
క్రీడల వల్ల ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని భద్రాచలం ఐటిడిఏ డిడి మణెమ్మ అన్నారు. గురువారం మండల పరిధిలోని కొత్తపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో దుమ్మగూడెం, చర్ల మండలాల జోనల్ స్థాయి క్రీడలకు క్రీడాకారుల ఎంపికను గురువారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు పీ.మనెమ్మ, పిఎంఆర్సి ఏ సి ఎం ఓ, టీ.రమణయ్య లు వచ్చి జెండా ఊపి క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిడి విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ.. క్రీడలు మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఎంతో దోహదపడతాయని ప్రతిరోజు విద్యార్థిని విద్యార్థులు వాకింగ్ గ్రౌండ్ ఆక్టివిటీస్ యోగాసనాలు వంటి కార్యక్రమాలు చేసినట్లయితే ప్రతి విద్యార్థి ఉల్లాసంగాను ఉత్సాహంగాను తయారవుతారని తెలిపారు. ప్రతి విద్యార్థి ఆటపాటలలో ముందుండాలని కోరారు.ఈ జోనల్ స్థాయి క్రీడల కార్యక్రమానికి కొత్తపల్లి ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడకం మోతీరు,ఏపీఎస్ ప్రధానోపాధ్యాయులు కారం సర్వేశ్వరరావు దొర, ఫిజికల్ డైరెక్టర్ బట్ట హరికృష్ణ, వివిధ ఆశ్రమ పాఠశాలల ఫిజికల్ డైరెక్టర్లు కొత్తపల్లి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.