మన్యం న్యూస్,మణుగూరు:
మండల పరిధిచిక్కుడుగుంట గ్రామానికి చెందిన దరాజు వెంకటమ్మ (70) ప్రమాదవశాత్తు గురువారం మృతి చెందింది. ఈ విషయం తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వంద పడకల ఆసుపత్రి నందు మృతురాలి పార్థివ దేహాని సందర్శించి పూలమాలవేసి అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోశం నర్సింహారావు,బీ. ఆర్.ఎస్ మండల అధ్యక్షులు ముత్యం బాబు తదితరులు పాల్గొన్నారు.
