మన్యం న్యూస్ కరకగూడెం: కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కుర్నవల్లి గ్రామనికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొమరం సత్యనారాయణ తల్లి కొమరం.సమ్మక్క ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో శుక్రవారం వారి నివాసానికి వెళ్లి దశదినకర్మలకు హాజరై మృతురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
