UPDATES  

 బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే హరిప్రియ నాయక్

తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్

మన్యం న్యూస్,ఇల్లందు:టేకులపల్లి మండల పరిధిలోని కోదండ రామాలయం నందు శనివారం నిర్వహించిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఇల్లందు ఎమ్మెల్యే భానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ పాల్గొన్నారు. ఈ మేరకు మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ఇల్లందు నియోజకవర్గ ఆడపడుచులు, ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశంలోనే పూలను పూజించి, ప్రకృతిని ప్రేమించే గొప్పపండుగ బతుకమ్మ అని అలాంటి సంస్కృతి మన తెలంగాణలో ఉండటం గొప్ప విషయమని తెలిపారు. మహిళలను గౌరవిస్తూ వారి ఔన్నత్యాన్ని చాటిచెప్పే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్రపండుగగా గుర్తించిందన్నారు. ప్రతిఏటా తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఆడపడుచులలు చీరల పంపిణీ చేస్తుందని గుర్తుచేశారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా, ఆనందోత్సాహాలతో సంతోషకర వాతావరణంలో జరుపుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !