మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను,ఆడపడుచులందరూ కలిసి సంబరంగా జరుపుకున్నారు.ప్రకృతిని ఆరాధిస్తూ,తీరొక్క పూలతో బతుకమ్మలను తయారుచేసి, భక్తిశ్రద్ధలతో గౌరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆటపాటలతో మహిళలందరూ కలిసి సంతోషంగా బతుకమ్మ పండుగ వేడుకలను జరుపుకున్నారు.ఈ బతుకమ్మ సంబరాలలో గులాబీల జెండాలే రామక్క పాట ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కడ చూసినా గులాబీల జెండాలే రామక్క పాట వైరల్ గా మారింది.