మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కాంగ్రెస్ అధిష్టానం, క్యాడర్ పై ఇష్టానుసారంగా నోరు వారేసుకుంటే ప్రతిఘటన తప్పదని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుపై భద్రాచలం ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పొదెం వీరయ్య తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శనివారం భద్రాచలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వీరయ్య మాట్లాడారు. ఇటీవల కాలంలో రేగా కాంతారావు నోరు పారేసుకుని మాట్లాడుతున్నాడని ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు. ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న రేగ కాంతారావు భద్రాచలం అభివృద్ధికి ఏం చేశాడని
ప్రశ్నించారు. రేగా కాంతారావు కాంగ్రెస్ పార్టీలో పుట్టి ఎత్తుకెళ్లిన తర్వాత ఆ పార్టీనే మోసం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన రేగ ఇవాళ విమర్శించే స్థాయికి దిగొచ్చావని ఎమ్మెల్యే వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
10 ఏళ్లుగా భద్రాచలం నియోజకవర్గ ప్రజలు ప్రజలను మోసం చేసింది సరిపోలేదని ఘాటుగా విమర్శించారు. పైగా ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి భద్రాచలం అభివృద్ధి చేసి చూపిస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి భద్రాచల పట్టణానికి ఐదు గ్రామ పంచాయతీలు కలిపేది పోయి ఉన్న ఒక్క గ్రామ పంచాయతీని మూడు ముక్కలుగా చీల్చేస్తుంటే కూడా నోరు మెదపలేని మీరు ఏదో అభివృద్ధి చేస్తారని మళ్ళీ ప్రజల్ని మోసం చేయడానికి దిగిరావడం సిగ్గుచేటు అన్నారు. బీసీ బందు గృహలక్ష్మి మైనారిటీ బందు దళిత బంధు పేర్లు చెప్పి ఎంతమంది అమాయక పేద ప్రజలను మోసం చేయడం నిజం కాదా అని మండిపడ్డారు. కనీసం అర్హులైన పేద ప్రజలకు పెన్షన్లు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం భద్రాచలాన్ని ఏదో ఇంకా ఉద్దరిస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. రాములవారి ఆలయ అభివృద్ధికి ఇస్తానన్న 100 కోట్లు ఇవ్వకపోగా 10 సంవత్సరాలుగా కనీసం ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ కూడా వేయని చేతగాని ప్రభుత్వం భద్రాచలాన్ని అభివృద్ధి చేస్తుందా అని విరుచుకుపడ్డారు. భద్రాచలం పట్టణాన్ని వరదలు భారి నుంచి కాపాడడానికి 1000 కోట్లు వెంటనే మంజూరు చేస్తానని చెప్పి పోయిన సీఎం కేసీఆర్ కనబడకుండా పోయారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐటీడీఏలలో పెట్టాల్సిన పాలకమండలి సమావేశాన్ని కూడా భద్రాచలం ఐటీడీఏలో కాలవ్యవధిలో పెట్టకుండా గిరిజన ప్రజలను ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందన్నారు. భద్రాచల ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ల కొరతను ఎందుకు తీర్చలేకపోయారని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రిగా రవాణా శాఖ మంత్రిగా ఉండి కూడా నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన భద్రాచల పట్టణ బస్టాండ్ ను కూడా అభివృద్ధి చేసుకునే పరిస్థితి లేని నాయకులు ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడటం దారుణం అన్నారు. తెలంగాణాలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే నని భద్రాచల నియోజకవర్గ అభివృద్ధికి తన బాధ్యత అని పేర్కొన్నారు
ఈ విలేకరి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరేష్, టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చింతిరాల రవికుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డి, అడబాల వెంకటేశ్వరరావు, సతీష్, లంకా శ్రీనివాసరావు, శ్రీనివాస్ గౌడ్, బత్తుల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.