UPDATES  

 రాహుల్ తో తుమ్మల పొంగులేటి భేటీ కాంగ్రెస్ అభ్యర్ధులు ఫిక్స్

రాహుల్ తో తుమ్మల పొంగులేటి భేటీ

కాంగ్రెస్ అభ్యర్ధులు ఫిక్స్

ఖమ్మం నుండి తుమ్మల.. పాలేరు నుండి పొంగులేటి

మధిర నుండి భట్టి, ఇల్లందు నుండి కోరం

పినపాకపై సస్పెన్స్

(మన్యంన్యూస్ బ్యూరో)

ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీని మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిసిన తర్వాత ఖమ్మం జిల్లా సీట్లపై క్లారిటీ వచ్చింది. ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న కాంగ్రెస్ పాలిటిక్స్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, క్యాంపెయిన్ కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురూ కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు రాహుల్ గాంధీ ప్రత్యేక భరోసా ఇవ్వడంతో.. ఖమ్మం లో పోటీకి సై అన్నట్లు సమాచారం. వీటితో పాటు ఇతర సీట్లపై కూడా ఏకాభిప్రాయం వచ్చినట్లు సమాచారం. వామపక్షాలతో చర్చలు ముగించి.. జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. భద్రాచలం సిట్టింగ్ సీటుపై కాంగ్రెస్ పట్టుబడుతుండడంతో ఈ సీటును బట్టి పినపాక అభ్యర్ధి ఖరారుకానున్నారు. సీపీఐకి కొత్తగూడెం స్థానం ఇవ్వడం దాదాపు ఖరారే. పొత్తు లేకుంటే ఈ సీటును ఎడవెల్లి క్రిష్ణకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

రసవత్తరం
ఖమ్మం నుంచి కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ పై తుమ్మల పోటీచేయబోతుండడటంతో పోటీ రసత్తరంగా మారే అవకాశం ఉంది. ఖమ్మంలో పోటీలో ఎవరు ఉంటారనే దానికి తెరదించుతూ తుమ్మల ను అధిష్టానం ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. పాలేరు నుంచి మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీచేయడం ఖాయమైంది.

కాంగ్రెస్ అభ్యర్థులు ఫైనల్

ఖమ్మం- తుమ్మల నాగేశ్వరరావు

పాలేరు- పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మధిర – భట్టి విక్రమార్క

ఇల్లందు- కోరం కనకయ్య

వైరా …..రామదాస్ నాయక్

కొత్తగూడెం ….కూనంనేని సాంబశివరావు ( సిపిఐ)/ ఎడవల్లి కృష్ణ (కాంగ్రెస్)

సత్తుపల్లి …. డాక్టర్ మట్టా రాగమయి

పినపాక ….పాయం వెంకటేశ్వర్లు /పొదెం వీరయ్య (వామపక్షాలతో పొత్తును బట్టి)

భద్రాచలం – పొదెం వీరయ్య (పొత్తు ఉంటే సిపిఎం )

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !