మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రజల రక్షణ కొరకు నిరంతరం శ్రమిస్తూ సామాజిక సేవలను అందిస్తున్న పోలీసులను హత మార్చేందుకు మావోయిస్టులు ఉపయోగించే పేలుడు సామాగ్రిని శనివారం భద్రాచలం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల జరుగుతున్న రవాణా తీరు వివరాలను భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్ వెల్లడించారు. భద్రాచలం బస్టాండ్ లో తనిఖీల నిమిత్తం పోలీసులు విధులు నిర్వహిస్తుండగా ఎక్కడున్న ముగ్గురు వ్యక్తులు అనుమాన స్పదంగా సంచులతో తిరుగుతుండడంతో అనుమానం వచ్చి సంచులను పరిశీలించగా అందులో భారీగా పేలుడుకు సంబంధించిన పలు రకాల సామాగ్రి బయటపడిందని తెలియజేశారు. అంతేకాకుండా నిషేధిత సిపిఐమావోయిస్టు పార్టీ కొరియర్ సానుభూతి పరులుగా గుర్తించడం జరిగింది అన్నారు.
పేలుడు పదార్థాలను మావోయిస్టులకు చేరవేసేందుకు వెళ్తున్న గుంజి విజయ్, బొంత నవీన్, భూక్యా నవీన్ లను అదుపులోకి తీసుకొని అరెస్టు చేయడం జరిగిందన్నారు.
వీరిలో గుంజి విజయ్ గత 5 సంవత్సరాలుగా నిషేదిత మావోయిస్ట్ లకు కొరియర్ గా పనిచేస్తు వారికి కావలసిన ప్రేలుడు పదార్దాలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. బొంత నవీన్ ప్రేలుడు పదార్దాల షాప్ యజమాని అని ఇతనుమహబూబాద్ జిల్లా శేనిగాపురంలో తిరుమల ఏజెన్సీ పేరుతో షాప్ నడుపుతూ గతంలో ప్రేలుడు పదార్దాలను
గుంజి విజయ్ కు భూక్యా నవీన్ మద్యవర్తిత్వం ద్వారా అమ్మినట్లుగా పేర్కొన్నారు. అట్టి వాటిని గుంజి విజయ్ నిషేదిత మావోయిస్ట్ లకు అందజేసినట్లు తెలిపారు. మళ్ళీ నిషేదిత మావోయిస్ట్ ల ఆదేశాల ప్రకారం గుంజి విజయ్,
బొంత నవీన్, భూక్యా నవీన్ లు ప్రేలుడు పదార్దాలు నిషేదిత సి పి ఐ మావోయిస్ట్ పత్రిక
ప్రకటనల ప్రతులతో మావోయిస్ట్ లను కలిసి వారికి ప్రేలుడు పదార్దాలు అప్పగించి మావోయిస్ట్ లతో ప్రేలుడు
పదార్ధాలు సరఫరా చేయటానికి వొప్పందం కుదుర్చుకోవటానికి చత్తీస్గడ్ అటవీ ప్రాంతానికి చర్ల మీదుగా వెళ్ళటానికి భద్రాచలం బస్ స్టాండ్ లో బస్ కోసం వేచి ఉండగా ముగ్గురిని పట్టుకున్నట్లు తెలిపారు. పేలుడు పదార్దాలతో పట్టుబడిన ముగ్గురిపై భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ నందు పేలుడు పదార్థాల
చట్టం, ఉపా చట్టం ఐపీసీ ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. వీరిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం భద్రాచలం కోర్టుకు తరలించినట్లు తెలిపారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ విప్లవ పోరాటం పేరుతో అమాయక గిరిజనులను మావోయిస్టులు వేధించడం జరుగుతుందన్నారు. తెలంగాణలో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని ఎప్పుడో కోల్పోయినట్లుగా తెలిపారు. మావోయిస్టుల సమావేశాల్లో పాల్గొనేందుకు అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు వివరించారు. అయితే మావోయిస్టుల దుర్బుద్ధి గురించి అమాయక గిరిజనులు తెలుసుకుని సమావేశాలకు హాజరుకావడానికి నిరాకరిస్తున్నారని తెలిపారు. మావోయిస్టుల వేధింపులకు నిరసనగా అమాయక గిరిజనులు ఉద్యమిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనుల వల్ల వారికి మేలు జరుగుతుందన్నారు. తెలంగాణ చతిస్గడ్ సరిహద్దు ప్రాంతంలో తమ ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతో చత్తీస్గడ్ ప్రాంతంలోని ఆదివాసీలను మిలీషియా సభ్యులుగా కమిటీ సభ్యులుగా నియమిస్తూ వారిచేత చట్ట వ్యతిరేక పనులను చేస్తున్నారని తెలిపారు. నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీ నాయకులు దళసభ్యుల ఆదేశాలు పాటిస్తూ తెలంగాణ ప్రాంతంలో విధ్వంసకర చర్యలకు పాల్పడినట్లయితే చట్టప్రకారం కఠినలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
మావోయిస్టు పార్టీ ఆదివాసీల పట్ల ఎటువంటి దాడులకు పాల్పడకుండా పోలీసులు చర్యలు
తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలో ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు
బెదిరింపులకు గురై మావోయిస్టు పార్టీ నిర్వహిస్తున్న బలవంతపు సమావేశాలకు వెళ్లరాదని పోలీసులు ఎల్లప్పుడూ మీ రక్షణ నిమిత్తం అందుబాటులో ఉంటారని ఎస్పీ స్పష్టం చేశారు.