మన్యంన్యూస్,ఇల్లందు:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 10,18వ వార్డుల నందు దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన మండపాలలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేకపూజా కార్యక్రమాల్లో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు బాస శ్రీనివాస్, మార్గదర్శి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రిన్సిపల్ అర్వపల్లి రాధాకృష్ణ, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, పార్టీ పట్టణ యువజన అధ్యక్షులు మెరుగు కార్తీక్, జబ్బర్, వార్డుకమిటీ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
