మన్యం న్యూస్ కారేపల్లి,అక్టోబర్ 15:
కారేపల్లి మండలం గుట్టక్రిందగుంపు వద్ద మోటర్ సైకిల్ ను ట్రాక్టర్ ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. సూర్యతండాకు చెందిన బాదావత్ రవి,జర్పల పీక్లాలు ఇల్లందులో వేడుకకు హాజరై వెళ్ళి తిరిగి సూర్యతండా వస్తున్నారు.ఈక్రమంలో గుట్టకిందిగుంపు రోడ్డు వద్దకు రాగానే గుట్టకిందగుంపు నుండి వాంకుడోత్ భద్రు తన ట్రాక్టర్ తో వస్తూ మూలమలపువద్ద మోటర్ సైకిల్‌ను ఢీ కొట్టాడు.ఈప్రమాదంపై మోటర్ సైకిల్ ఉన్న బాదావత్ రవి,జర్పుల పీక్లాలకు తీవ్రగాయాలైనాయి.పీక్లా కాలు నుజ్జునుజ్జు అయింది.బాధితులను 108 ద్వారా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.దీనికి సంబంధించి బాధితుల బంధువు బానోత్ దళ్చంద్ ఇచ్చిన పిర్యాదుమేరకు కారేపల్లి ఎస్సై పుష్పాల రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
