మన్యం న్యూస్ చర్ల:
మహిళలు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు మద్దెల అన్నపూర్ణ అన్నారు. ఆ సంస్థ చైర్మన్ బివి రాజు ఆదేశాలనుసారం ఆదివారం మండలంలోని రాళ్ల గూడెం గ్రామంలో మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్ని చట్టాలు వచ్చినా ఎక్కడో చోట మహిళలకు అన్యాయాలు, అక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇటువంటి ఘటనల పట్ల మహిళలు కఠినంగా ఉండాలన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం చేసిన చట్టాలను అన్ని విధాల వినియోగించుకోవాలన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పూజల లక్ష్మి, కుసుమ, సత్యవతి, కుమారి, గ్రామస్తులు పాల్గొన్నారు పాల్గొన్నారు